
కామారెడ్డి: రోడ్డు మరమ్మతులు చేస్తున్న కార్మికుడిని కంటైనర్ ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి శివారులోని జాతీయ రహదారిపై మరమ్మతులు నిర్వహిస్తున్న కార్మికుడు అటుగా వస్తున్న కంటైనర్‌ను ఆపాలని కోరాడు. కానీ కంటైనర్ డ్రైవర్ ఆపకుండా తన వాహనంతో ఆ కార్మికుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ కార్మికుడిని చికిత్స నిమిత్తం మొదట కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లో చేర్పించారు. బాధితుడు వికారాబాద్ జిల్లా బానాపూర్‌కు చెందిన యాదప్పగా గుర్తించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు