బ్రహ్మానందం చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు..?

బ్రహ్మానందంకు ఎంతమంది కొడుకులున్నారు..? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి సరిగ్గా తెలియదు. ఎందుకంటే బయటికి వచ్చేది ఒక్కడు మాత్రమే.. అతడే గౌతమ్. పైగా ఆయన హీరో కూడా. అప్పట్లో పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు గౌతమ్. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తర్వాత కనిపించలేదు. కొన్నేళ్ల తర్వాత కొత్త దర్శకులతో ప్రయోగాలు చేసాడు కానీ గౌతమ్ కోరుకున్న విజయం మాత్రం రాలేదు. బసంతి, మనూ లాంటి సినిమాల కోసం తన పరపతి వాడి ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితోనూ ప్రమోషన్ చేయించాడు బ్రహ్మానందం. అయినా కూడా అవి పెద్దగా గుర్తింపు అయితే తీసుకురాలేదు. కొత్త కథలు చేస్తున్నాడనే పేరొచ్చింది కానీ కోరుకున్న గుర్తింపు మాత్రం రావడం లేదు

దాంతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరం అయిపోయాడు ఈయన.

అయితే బ్రహ్మానందానికి ఒక్క కొడుకు కాదు ఇద్దరున్నారు. రెండో వాడి గురించి చాలా మందికి తెలియదు అంతే. గౌతమ్ కాకుండా బ్రహ్మికి ఉన్న మరో అబ్బాయి పేరు సిద్ధార్థ్. ఈయన బయటికి రాలేదు.. ఎక్కువగా రాడు కూడా. అందుకే సిద్దూ గురించి అభిమానులకు తెలియదు. కానీ ఇప్పుడు చిన్న కొడుకుతో ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. సిద్ధార్థ్ విదేశాల్లో చదువుకుని ఈ మధ్యే ఇండియా వచ్చాడు. సిద్ధూ వచ్చిన తర్వాత బ్రహ్మితో ఉన్న పోటోలు కూడా బయటికి వచ్చాయి. ఈయనకు కూడా సినిమాలపై ఆసక్తి లేనట్లే ఉంది. ఎందుకంటే బిజినెస్ వైపు పరుగులు తీస్తున్నాడు సిద్ధార్థ్. సినిమాలు కాకుండా కేవలం వ్యాపారాలపైనే ఫోకస్ చేయాలని చూస్తున్నాడు.

చిన్న కొడుకును అయినా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నా కూడా ఆయన కూడా ఆసక్తి చూపించడం లేదు. దాంతో అంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కొడుకులను మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నాడు బ్రహ్మానందం. కొడుకులకు నచ్చనపుడు వాళ్లను ఫోర్స్ చేయడం లేదు బ్రహ్మానందం. ఎవరికి నచ్చిన వాళ్ల పని వాళ్లు చేసుకోమంటున్నాడు. మొత్తానికి బ్రహ్మానందం చిన్న కొడుకు గురించి ఇఫ్పుడు ఆసక్తికరమైన నిజాలు బయటికి వస్తున్నాయి. అవి తెలిసి నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم