
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో మొదట్లో అభిజిత్-మోనాల్-అఖిల్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఎంత హైలెట్ అయిందో చెప్పనక్కర్లేదు. గంట సేపు ప్రసారమయ్యేలో షోలో.. ఈ ముగ్గురికే ఎక్కువ స్క్రీన్ స్పెస్ ఇచ్చేవాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఎత్తుగడను పసిగట్టిన మిస్టర్ కూల్ అభిజిత్.. మోనాల్‌తో కాస్త దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. దీంతో అఖిల్- మోనాల్ ప్రేమాయణాన్ని హైలెట్ చేసి చూపించాడు బిగ్‌బాస్. ఇక వీరిద్దరంతా కాకపోయినా.. అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. నోయల్, లాస్య ఎలిమినేట్ అయ్యాక అభి, ఎక్కువగా హారికతోనే గడిపాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్న మాటలు, హగ్‌లు, ముద్దులను హైలెట్ చేసి చూపించాడు బిగ్‌బాస్. దీంతో అభికి హారిక మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
(చదవండి: బిగ్‌బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే)
తాజాగా ఆయన ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హారిక తన చెల్లి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, ఇక హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని, అందుకే ఆమెతో ఎక్కు టైం స్పెండ్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయాన్ని హౌస్‌లో హారికకు ఎన్నోసార్లు చెప్పానని, అది బయటకు రాలేదని ఇప్పుడే తెలిసిందని అభి చెప్పుకొచ్చాడు. రేటింగ్ కోసమే బిగ్‌బాస్ అభి, హారిక రిలేషన్‌ని వేరుగా చూపించినట్లు అర్థమవుతుంది.