1. అమెరికాలోనూ కొత్తరకం వైరస్!
యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోకి ప్రవేశించింది. కొలరాడో రాష్ట్రంలో తొలి కేసు నమోదైనట్లు గవర్నర్ జేర్డ్ పొలిస్ ప్రకటించారు. డెన్వర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఈ కొత్త రకం వైరస్ సోకినట్లు గుర్తించారు. అయితే ఇటీవల అతను ఎక్కడికి ప్రయాణించిందీ లేదని అధికారులు తెలిపారు. దీన్ని అమెరికా ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ పరిగణనలోకి తీసుకుంది.
2. పోస్టులు పెడితే.. పనిపడతారు!
ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై పోలీసు కేసులు నమోదు చేయడం.. విచారణ పేరుతో స్టేషన్లకు, కోర్టులకు తిప్పడం పరిపాటిగా మారింది. ఇవే కాదు.. కొంతమందిపై భౌతిక దాడులూ జరుగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన నందం సుబ్బయ్య హత్య.. ఈ పరంపరలో తాజా ఘటన. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరికొన్ని ఘటనలు..
3. 14,341 పోలీసు పోస్టులు ఖాళీ
ఆంధ్రప్రదేశ్‌లో 14 వేల పైచిలుకు పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం మంగళవారం విడుదల చేసిన ‘డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్’ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి 1నాటికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పోలీసు బలగాల స్థితిగతులను ఈ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రానికి 73,894 పోలీసు పోస్టులు కేటాయించగా ప్రస్తుతం 59,553 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది.
4. ఫోన్ కెమెరా @ 2020
స్మార్ట్ ఫోన్ కొందాం అనుకుంటే ముందుగా ఆలోచించే వాటిల్లో కెమెరా స్పెసిఫికేషన్ కచ్చితంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా డిజిటల్ కెమెరాకి పోటిగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ మొబైల్ ప్రియుల్ని అలరిస్తోంది. ఫొటోగ్రఫీపై పెద్దగా అవగాహన లేనివారు కూడా అదిరే ఫొటోలు, వీడి యోలు తీసుకుని భద్రం చేసుకుంటున్నారు. ఏకంగా 8రీ రిజల్యూషన్‌తో జ్ఞాపకాల్ని చిత్రీకరించేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020లో స్మార్ట్ ఫోన్ కెమెరా కన్ను ఎలా మారుతూ వచ్చిందో తెలుసా?
5. కొరియా కృత్రిమ సూర్యుడుద
క్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు! 20 సెకండ్ల పాటు ఏకంగా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జ్వలించాడు. కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యుజన్ ఎనర్జీ, సియోల్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన ఈ కృత్రిమ సూర్యుడి పేరు... కె-స్టార్ (ది కొరియా సూపర్ కండక్టింగ్ టొకమాక్ అడ్వాన్సుడ్ రీసెర్జ్). 2008లోనే తొలిసారిగా ఇది సంచలనం సృష్టించింది. అయితే- 2025 నాటికి దీన్ని కనీసం 300 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలన్నది పరిశోధకుల లక్ష్యం.
6. జనవరి నుంచి వచ్చే మార్పులవీ..
కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయి. జనవరి 1 నుంచి నిత్య జీవితానికి సంబంధించి పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇందులో వాహనాలకు సంబంధించినవి కొన్ని కాగా.. బ్యాంకింగ్, టెలికాం రంగాలకు చెందిన కొన్ని ఉన్నాయి. ఆ మార్పులేంటో చూసేయండి.. జనవరి 1 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు (ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మినహా) కేంద్రం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చని, నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.
7. చోదకా.. ఉల్లంఘనలు సాగవిక!
వాహనం చేతిలో ఉంది కదా అన్ని అడ్డగోలుగా నడిపితే కుదరదు. ఒకవేళ పోలీసులు పట్టుకున్నా చలానా కట్టి తప్పించుకోవచ్చనుకుంటే అసలే కుదరదు. ప్రమాదాలు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. పట్టుబడ్డ వెంటనే ఆటోమేటిగ్గా డ్రైవింగ్ లైసెన్సు రద్దయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. అందుకోసం డేటాను రవాణాశాఖతో అనుసంధానం చేసే యోచనతో ఉన్నారు.
ఐరోపా ఖండంలోని క్రొయేసియా దేశాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రాజధాని జాగ్రెబ్‌కు ఆగ్నేయంగా 46 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. పెత్రింజా పట్టణంలో దాదాపు అన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగెత్తారు. ఏడుగురు మృతి చెందగా 20 మంది వరకూ గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది.
9. ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల్లో రింగ..రింగా
రింగ.. రింగ.. రింగా.. బావలు సయ్యా.. అంటూ పాటలు. అసభ్య నృత్యాలు. మందు.. చిందులు..రేవ్, ముజ్రా పార్టీలకు నగరం శివార్లలోని కొన్ని ఫామ్‌హౌస్‌లు.. రిసార్టులు.. అతిథి గృహాలు చిరునామాలుగా మారుతున్నాయి. శని, ఆదివారాలొస్తే జూనియర్ ఆర్టిస్టులు, యువతులు అక్కడ సందడి చేస్తుంటారు. ‘స్ట్రిప్‌టీజ్(ఒక్కొటొక్కటిగా వలువలు తీయడం)’ నృత్యాలతో హాజరైన వారికి కిర్రెక్కిస్తున్నారు. డబ్బు ఎక్కువగా వస్తుందన్న భావనతో అతిథిగృహాల నిర్వాహకులు, రిసార్ట్‌ల యజమానుల రేవ్, ముజ్రా పార్టీలు నిర్వహించేవారికి అద్దెకిస్తున్నారు. కీసరలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి జరిగిన రేవ్‌పార్టీ పోలీసుల దాడుల్లో వెలుగు చూసింది.
10. గెలుపంటే ఇదేరా
ఆస్ట్రేలియాలో టెస్టు విజయం ఎప్పుడూ గొప్పదే! ఏడు దశాబ్దాలకు పైగా ఆ దేశంలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా.. ఇన్నేళ్లలో అక్కడ సాధించిన టెస్టు విజయాలు కేవలం ఏడు. ఇప్పుడు ఎనిమిదో విజయం అందుకుంది. కానీ ఇది ఇంతకుముందు సాధించిన విజయాల్లాంటిది కాదు.. ఎంతో ప్రత్యేకమైంది.. అసాధారణమైంది.. అపురూపమైంది. సిరీస్ ఆరంభ పోరులో ఘోర పరాభవం ఎదుర్కొన్నాక.. తర్వాతి మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయి.. ప్రత్యర్థికి పోటీ అయినా ఇస్తుందా అనుకున్న స్థితిలో.. సమష్టి ఆటకు నిర్వచనం చెబుతూ, ఆద్యంతం ఆధిపత్యాన్ని చాటుతూ, ప్రత్యర్థికి మ్యాచ్‌లో ఏ దశలోనూ పైచేయి సాధించే అవకాశమే ఇవ్వకుండా.. గత మ్యాచ్ పరాభవానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంటూ అందుకున్న విజయమిది!