దుర్గాప్రసాద్ ఈ నెల ఈనెల 13న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు.. అతడి ఆచూకీ రెండు రోజులైనా తెలియకపోవడంతో తండ్రి వీరబాబు ఈనెల 15న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో భూపాలపట్నం చెరువులో శతల, మొండెం వేరుచేయబడి ఉన్న ఈ మృతదేహాన్ని స్థానికులు చూశారు. వెంటనే వీఆర్వోకు చెప్పగా.. రాజానగరం పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా నరికి, సిమెంటు సంచిలో వేసి మూట కట్టి చెరువులో పడవేశారు. అయితే మూట కట్టు విడిపోయి, సంచెలో నుంచి కాళ్లు బయటకు వచ్చి నీటిపై తేలడంతో స్థానికుల ద్వారా బయటపడింది.
వేరొక ప్రాంతంలో హత్య చేసి, ఆపై తలను, మొండేన్ని వేరుచేసి, సంచిలో మూట కట్టి, ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు, రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలతో హత్య చేశారా.. ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తూ.గో: ఈ నెల 15న యువకుడు మిస్సింగ్.. తల, మొండెం వేరు చేసి సంచిలో కట్టి దారుణంగా తూ.గో: ఈ నెల 15న యువకుడు మిస్సింగ్.. తల, మొండెం వేరు చేసి సంచిలో కట్టి దారుణంగా