శ్రీశైలం, న్యూస్‌టుడే: శ్రీశైలంలోని ఆర్డీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాకతీయ కమ్మవారి సత్రంలో మంగళవారం సత్రం సిబ్బంది, భక్తుల మధ్య జరిగిన ఘర్షణలో సిబ్బంది ఒకరు మృతి చెందారు. సీఐ బీవీ రమణ కథనం మేరకు.. గుంటూరు జిల్లా పిచ్చికలపాలెం గ్రామానికి చెందిన నలుగురు భక్తులు శ్రీశైలానికి వచ్చారు. మధ్యాహ్నం కాకతీయ సత్రంలోని భోజనశాలకు వెళ్లారు. భోజన సమయం అయిపోయిందని, బఫే పద్ధతిలో మీరే వడ్డించుకోవాలని అక్కడి ఇన్‌ఛార్జి కందిమల్ల శ్రీనివాసరావు (59) సూచించారు. దాంతో భక్తులు, శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం పెరిగి తోపులాటకు దారితీసింది. శ్రీనివాసరావును తోసేయడంతో కిందపడ్డారు. ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. మృతుడిది గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం దండముడి గ్రామం. ఏడేళ్లుగా శ్రీశైలంలోని సత్రంలో పనిచేస్తున్నారు.
ప్రాణం తీసిన భోజనాల గొడవ
AMARAVATHI NEWS WORLD
0