ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఆ ప్రాంతం మళ్లీ వేడెక్కింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో మహిళ చినబుజ్జి(40) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. మహిళ మృతదేహాన్ని రాత్రి వెలగపూడికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను భారీగా మోహరించారు. ఈ ప్రాంతంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత బాధితులకు పరామర్శించేందుకు ఘటనా స్థలికి చేరుకున్నారు.
నందిగం సురేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు..
బాధితులను పరామర్శించేందుకు హోంమంత్రితో పాటు ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున వెలగపూడి చేరకున్నారు. అయితే నందిగం సురేష్ వెనక్కి వెళ్లిపోవాలంటూ కొందరు నినాదాలు చేశారు.