ప్రియుడు దక్కలేదని అత్తింట్లోనే ఆత్మహత్య


ప్రియుడు దక్కలేదని అత్తింట్లోనే ఆత్మహత్య

వరంగల్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి  మండలం మాణిక్యపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని కాదని మరో యువకుడితో పెళ్లి చేశారని అత్తవారింట్లోనే ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. 

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరికి చెందిన రవళితో వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌ గ్రామానికి చెందిన రాజుకు 16 రోజుల క్రితం వివాహం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ సూసైడ్‌ నోట్‌రాసి సోమవారం రాత్రి అత్తారింట్లోనే నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు. అమ్మా నీకు తెలుసు. కులం, మతం చూడొద్దు. భర్తకు క్షమాపణ చెబుతున్నా’’  అని ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన పక్షం రోజులకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم