రుణ యాప్‌ల వేధింపులకు యువకుడి బలి


ప్రైవేటు కంపెనీ ఉద్యోగి బలవన్మరణం ఆలస్యంగా వెలుగుచూసిన వైనం

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ఎస్‌ఎల్‌.ట్రాన్స్‌ కంపెనీలో సైట్‌ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న సంతోష్‌కుమార్‌ (36) రుణయాప్‌ల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకిరుణ యాప్‌ల వేధింపులకు యువకుడి బలివచ్చింది. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్‌కుమార్‌ ఎన్టీపీసీ మల్కాపూర్‌ శివారులో అద్దెకు ఉంటున్నారు. ఆన్‌లైన్‌లో ఉదాన్‌లోన్‌ యాప్‌లో రూ.9319, రుఫిలో లోన్‌ యాప్‌లో రూ. 9197, రూపేలోన్‌ యాప్‌లో రూ.4230, ఎఎఎ-క్యాష్‌ లోన్‌ యాప్‌లో రూ.16660, లోన్‌గ్రాన్‌ యాప్‌లో 14770 అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల రుణయాప్‌ల నిర్వాహకులు వడ్డీ, అసలు చెల్లించాలని ప్రతిరోజు ఫోన్‌ చేసి వేధించే వారు. వారి బెదిరింపులు భరించలేక ఈ నెల 18న కిరాయికి ఉండే ఇంట్లో గడ్డి మందు తాగాడు. తన చరవాణిలో సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితుడైన సుబ్రహ్మణ్యంకు పంపాడు. స్నేహితుడు గోదావరిఖనిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి సంతోష్‌కు చికిత్స చేయించాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంతోష్‌కుమార్‌ బంధువులు వచ్చి ఈ నెల 21న మెరుగైన వైద్యం కోసం స్వస్థలం విశాఖపట్నం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సంతోష్‌కుమార్‌ విశాఖలో ఈ నెల 23న మృతి చెందాడు. మిత్రుడు సంతోష్‌కుమార్‌ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఉదాన్‌లోన్‌, రుఫిలో లోన్‌, రూపేలోన్‌, ఎఎఎ-క్యాష్‌ లోన్‌, లోన్‌ గ్రాన్‌ యాప్‌ల యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం గురువారం ఎన్టీపీసీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్‌రాజ్‌ తెలిపారు.

Post a Comment

أحدث أقدم