ఆచార్యలో జిగేలు రాణి..?జోరుగా సాగుతోన్న ప్రచారం

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన తాజా సమాచారం ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే సైతం సందడి చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పూజా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారట. అది కూడా రామ్‌చరణ్‌ లవర్‌గా. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం పూజాని సంప్రదించిందని.. ‘ఆచార్య’లో నటించేందుకు ఆమె ఎంతో ఆసక్తిగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘అల.. వైకుంఠపురములో..’ విజయం తర్వాత పూజాహెగ్డే ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌‌’ చిత్రీకరణలతో బిజీగా ఉంటున్నారు. మరోవైపు చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చెర్రీ-పూజా కలిసి ‘రంగస్థలం’లోని ‘జిగేలు రాణి’ పాట కోసం ఆడిపాడారు.

Post a Comment

أحدث أقدم