ANW NEWS:తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద పాము సంచారంతో భక్తులు హడలిపోయారు. నిత్యం జనసందోహం ఉండే ఆలయ ప్రాంగణంలోకి పాము రావడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది పామును ప్లాస్టిక్ డబ్బాతో కప్పేశారు. ఆ వెంటనే పాములు పట్టే సిబ్బందిని పిలిపించడంతో వారు దాన్ని పట్టుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పామును సంచిలో వేసుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
తిరుమలలో పాము.. పరుగులు పెట్టిన భక్తులు
AMARAVATHI NEWS WORLD
0