ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ఆదేశాలు


ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ఆదేశాలు

ANW NEWS: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. ఎస్‌ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. కరోనా పరిస్థితులపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించిన అంశాలను తెలపాలని, దీనికి సంబంధించి ఈనెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది. 

హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించనుంది. కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడానికి కేంద్రం షెడ్యూల్‌ విడుదల చేస్తే దానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.

Post a Comment

أحدث أقدم