గొంతు మార్చి రూ. 36 లక్షలు కొట్టేశాడు


టీ.నగర్ ‌: ఆడగొంతుతో మాట్లాడి రూ.36 లక్షలు మోసగించిన నైజీరియా యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై కీల్పాక్కంకు చెందిన జోసెఫ్‌ (48), రాయల్‌ ట్రేడింగ్‌ పేరిట సంస్థ నడుపుతున్నాడు. తన ఫేస్‌బుక్‌ పేజీలో వ్యాపార వివరాలను పొందుపరిచారు. దీన్ని గమనించిన లండన్‌కు చెందిన ఎలిజబెత్‌ అనే మహిళ మెసెంజర్‌ ద్వారా జోసెఫ్‌ను సంప్రదించి పరిచయం పెంచుకుంది. ముంబైలో రక్త క్యాన్సర్‌ను నయం చేసే ఫోలిక్‌ ఆయిల్‌ లభిస్తున్నట్లు దీన్ని కొని పంపితే నగదు చెల్లిస్తానని నమ్మబలికింది.

రూ. 36 లక్షల ఫోలిక్‌ ఆయిల్‌ పంపితే ఇందుకు రూ.6 లక్షలు కమిషన్‌గా అందజేస్తానని తెలిపింది.  సునీత అనే మహిళతో మాట్లాడి పంపాలని కోరింది. దీంతో జోసెఫ్‌ మెసెంజర్‌ ద్వారా సునీతతో మాట్లాడగా తన బ్యాంకు అకౌంట్‌కు రూ.36 లక్షలు జమ చేసినట్లయితే వెంటనే ఫోలిక్‌ ఆయిల్‌ పంపుతానని తెలిపారు. జోసెఫ్‌ ఆమె ఖాతాకు రూ.36 లక్షలు చెల్లించి సునీత, ఎలిజబెత్‌ల కోసం ఫోన్‌లో సంప్రదించగా వారు స్విఛాప్‌ చేసివున్నారు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న జోసెఫ్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ముంబైలో మోసం జరిగినట్లు తెలిసింది

Post a Comment

أحدث أقدم