ఇక సెలవు


ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతిచెందారు.

1936 నవంబర్‌ 16న ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు.2016లోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందుకున్న మహోన్నత వ్యక్తి.

 గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు.

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.


బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 - 1961)

రామోజీ శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లి ఆచార సంప్రదాయాలతో పాటు నిత్యం భగవంతుడి ధ్యానంలో ఉండేవారు. తల్లి నుంచే రామోజీకి సైతం భక్తి, శుచి అలవడింది. లేక లేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా ‘రామోజీ రావు’ అన్న పేరును తనకు తానే పెట్టుకున్నారు. రామోజీరావు గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.


Post a Comment

أحدث أقدم