ANWtv: రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ నేతలతో నేడు కీలక భేటి

ANWtv:న్యూఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ గాంధీ కీలక సమావేశం ఉండనుంది. రానున్న లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే.. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై ఏఐసీసీలో ఈరోజు కీలక సమావేశం నిర్వహించనుంది. లోక్ సభ కోఆర్డినేటర్లతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.

తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు 13 మంది కో ఆర్డినేటర్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు రెండేసి లోక్ సభ స్థానాలకు కో ఆర్డినేటర్లుగా నియమించింది ఎఐసిసి. ఇక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఎఐసిసి లో సమావేశం జరుగనుంది. కాగా ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ రోజు మధ్యాహ్నం ఏఐసీసీ అధ్వర్యంలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల కో-ఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొననున్నారు డిప్యూటీ సీఎం. ఇక ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Post a Comment

Previous Post Next Post