ANWtv గుంటూరు: దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఒక్క చంద్రబాబేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బాబుకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదని, క్యాష్, కుట్రలు, కుత్రంత్రాలపై మాత్రమే నమ్మకం ఉండేదని మండిపడ్డారు. ఇలాంటివి చేసే ఎదిగాడు తప్ప ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు కాదని దుయ్యబట్టారు.
పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్ళి(ఉండవల్లి శ్రీదేవిని ఉద్ధేశిస్తూ) దొంగ ఓట్లపై ఫిర్యాదా అంటూ బాబుపై మండిపడ్డారు. తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూ పట్టుబడింది బాబే కదా అంటూ ఎద్దేవా చేశారు. శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్షనాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి పలు అంశాలను విన్నవించి.. బయటకు వచ్చి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్న మంత్రి అంబటి రాంబాబు గారు.