ANWtv: గుంటూరు: ఎంపీ కేశినేని నానిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. నానిది ఫ్యూడల్ మనస్తత్వమన్నారు. దళిత, బలహీన వర్గాల నాయకులతో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడరన్నారు. తిరువూరు టీడీపీ ఇన్‌చార్జ్ శావల దత్తును బండ బూతులు తిడుతూ, ఆయనపై దాడికి యత్నించిన మాట వాస్తవం కాదా?
ఎంపీ కేశినేని నానిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. నానిది ఫ్యూడల్ మనస్తత్వమన్నారు. దళిత, బలహీన వర్గాల నాయకులతో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడరన్నారు. తిరువూరు టీడీపీ ఇన్‌చార్జ్ శావల దత్తును బండ బూతులు తిడుతూ, ఆయనపై దాడికి యత్నించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ళ దాడికి పాల్పడిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌లతో రాజీపడి పార్టీకి ద్రోహం చేసిన నీచుడు నాని అని కనపర్తి మండిపడ్డారు.