టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. వైసీపీ నేతలు వెల్లంపల్లి, దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన జగన్ తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తో భేటీ తర్వాత కేశినేని కీలక వ్యాఖ్యలు చేశారు.
2013 నుంచి టీడీపీ కోసం కష్టపడుతున్నానని, చంద్రబాబు పాదయాత్రతో పాటు స్దానిక సంస్ధల ఎన్నికలనూ తన భుజంపై మోశానని కేశినేని నాని వెల్లడించారు. ఓ లక్ష్యంతో టీడీపీలో చేరానని, పనిచేశానన్నారు. పదవుల కోసం ఆశపడకుండా పార్టీ కోసం పనిచేశానన్నారు. ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారం కంటే పార్టీయే ముఖ్యం అనుకున్నానని కేశినేని పేర్కొన్నారు.
స్ధానిక ఎన్నికల్లో అడిగితేనే కూతురు శ్వేత పోటీకి దించానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టించి తిట్టించారన్నారు. తనను పార్టీలో నేతలు ఎన్ని మాటలన్నా కనీసం మద్దతివ్వలేదన్నారు.
స్ధానిక ఎన్నికల్లో అడిగితేనే కూతురు శ్వేత పోటీకి దించానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టించి తిట్టించారన్నారు. తనను పార్టీలో నేతలు ఎన్ని మాటలన్నా కనీసం మద్దతివ్వలేదన్నారు.
జగన్ నిరుపేదల పక్షపాతి అని, చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసని కేశినేని నాని తెలిపారు. కానీ ఇంత పచ్చి మోసగాడని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రంలో ఎవరికీ ఉపయోగం లేదన్నారు. అందుకే జగన్ తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు కేశినేని నాని తెలిపారు. ఎంపీగా రాజీనామా ఆమోదం పొందాకే వైసీపీలో చేరనున్నట్లు కేశినేని వెల్లడించారు.
తనకు విజయవాడ అభివృద్ధి ముఖ్యమని కేశినేని నాని తెలిపారు. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే 10 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. విజయవాడ రియాల్టీ అని, అమరావతి డ్రీమ్ సిటీ అని కేశినేని వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డిని టికెట్ అడగడం లేదని, అయన ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పనిచేస్తానన్నారు. టీడీపీ-జనసేనకు రాష్ట్రంలో 40 సీట్లకు మించి రావన్నారు.
మరోవైపు లోకేష్ పాదయాత్ర చేయడానికి ఏం హక్కు ఉందని కేశినేని ప్రశ్నించారు. నువ్వు ఆఫ్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యేవి,నేను నీ ముందు వచ్చి జి హుజూర్ అనాలా అని లోకేష్ ను ప్రశ్నించారు. నీకు ఏమి రైట్ ఉందని సీనియర్ నేతలను శాసిస్తున్నావని అడిగారు. నువ్వు ఏమి త్యాగాలు చేశావని నిలదీశారు. తండ్రి, తాతల వారసత్వం, పార్టీ అండగా ఉన్నా ఎమ్మెల్యేగా గెలవలేదని లోకేష్ పై విమర్శలు గుప్పించారు.