వైసీపీ రాష్ట్ర యువజన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొడాలి నాని గురించి మాట్లాడుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు.
నేను బతికున్నంత వరకు ఇదే రిపీట్ అవుద్ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు మరియు లోకేష్ పై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరికీ ప్రజల మరియు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని… తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్ర పై కూడా సెటైర్లు వేయడం జరిగింది. లోకేష్ పాదయాత్రకి పోటీగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెళ్ళితే అతనికంటే సిద్ధార్థకి ఎక్కువ జనాలు వస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం తాను వాళ్ళు చేసే కుట్రలను బయట పెట్టడం వల్లే అని తెలిపారు. ఇక జరగబోయే ఎన్నికల్లో ఐదోసారి గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని….అన్నారు. ఇదే సమయంలో గుడివాడ నియోజకవర్గం నుండి దమ్ముంటే లోకేష్ లేదా చంద్రబాబు… తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. లేకపోతే ఒకరు గుడివాడ మరొకరు గన్నవరం తనమీద వంశీ మీద పోటీ చేసి గెలవాలని… చాలెంజ్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా తాను బతికున్నంత కాలం రెపరెపలాడుతుందని కొడాలి నాని స్పీచ్ ఇచ్చారు.