ఎయిర్‌ మిసైల్‌ ప్రయోగం విజయవంతం

 విశాఖ బ్యూరో :శత్రు నౌకలు, విమానాలను ధ్వంసం చేసే మీడియం రేంజ్‌ సర్ఫెస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (క్షిపణి)ను ఇండియన్‌ నేవీ విజయవంతగా ప్రయోగించింది.

అరేబియన్‌ సముద్రంలో సోమవారం రాత్రి ఈ మిసైల్‌ను ప్రయోగిందింది. తూర్పు నౌకాదళానికి చెందిన మిసైల్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. డిఆర్‌డిఒ, ఐఎఐ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ నుంచి ఈ క్షిపణి రూపుదిద్దుకుంది. ఆకాశంలో తిరిగే శత్రు దేశాలకు చెందిన విమానాలపై సముద్ర ఉపరితలం నుంచి బహుముఖ ఫైరింగ్‌ చేసి ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం పేరు మీద ఇండియన్‌ నేవీ దీన్ని రంగంలోకి దించింది. అరేబియన్‌ సముద్రంలో నిప్పులు చెరుగుతూ, గగనతలంలోకి దూసుకెళ్లింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ అంకిత భావానికి ఇది నిదర్శనమని నావికాదళం ప్రకటించింది.

Post a Comment

Previous Post Next Post