పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట


గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులను శుక్రవారం ఓ  ప్రేమ జంట ఆశ్రయించారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధి కాజకు చెందిన  బుల్లా ప్రదీప్, అదే గ్రామానికి చెందిన  చింతలపూడి శైలి లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ  శుక్రవారం ఓ చర్చిలో   ప్రేమ  వివాహం చేసుకున్నారు. తమకు ఇరువురి  పెద్దల నుండి రక్షణ కావాలంటూ  నూతన వధూవరులు రూరల్  పోలీసులను ఆశ్రయించారు.  కాగా వరుడు  ప్రదీప్ మైనర్ అంటూ వధువు తరపున బంధువులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు తేల్చి చెప్పినట్లు వరుని తరపున బంధువులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم