టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.
కాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి కార్లు ముందుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందులో 4 కార్లు కాన్వాయ్ లోని వాహనాలు కాగా మరో రెండు కార్లు రిపోర్టర్స్ కి సంబంధించినవి. ఇందులో సిరిసిల్ల రిపోర్టర్స్ ఉండగా.. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తుంది.
క్లాసులో టీనేజర్ కు ప్రేమపాఠాలు.. స్కూల్ విద్యార్థితో ఉడాయించిన టీచర్.. ఎక్కడంటే..
ఇక ప్రమాదానికి గురైన కార్లను రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక రిపోర్టర్ల కార్లు ధ్వంసం అవ్వడంతో వారు తమ ఆవేదనను రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి చెప్పుకున్నారు.
కాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) గత కొన్నిరోజులుగా హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. మేడారం సమ్మక్క సారలక్క నుంచి మొదలైన ఈ పాదయాత్ర మహబూబాబాద్ , వరంగల్ పూర్తి చేసుకొని ఉమ్మడి కరీంనగర్ లో అడుగుపెట్టింది. ఈ యాత్రలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతుంది. ఈ క్రమంలో రామన్నపేటకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెళ్తుండగా ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి ఆరు కార్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే సరైన సమయంలో కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది.