సాత్విక్ ఆత్మహత్య కేసులో కీలక పురోగతి..ఆ నలుగురి అరెస్ట్

ఈ కేసుకు సంబంధించి లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నలుగురిని పోలీసులు రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు నర్సింగ్ పోలీసులు హాజరుపరిచారు. కాగా కాలేజీ యాజమాన్య వేధింపులు భరించలేక సాత్విక్ క్లాస్ రూమ్ లోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అంతకుముందు రాసిన సూసైడ్ నోట్ లో సాత్విక్ కీలక విషయాలు పేర్కొన్నాడు. ఈ లెటర్ లో సాత్విక్ తను పడ్డ బాధను వివరిస్తూ రాసిన అంశాలు ప్రతీ ఒక్కరిచేత కంటతడి పెట్టిస్తున్నాయి.

"అమ్మానాన్నఐ లవ్ యూ..మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ప్రిన్సిపాల్, లెక్చరర్లు పెట్టే టార్చర్ తో ఆత్మహత్య చేసుకుంటున్నాను. కృష్ణా, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. హాస్టల్ లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి. అమ్మానాన్న ఐ లవ్ యూ..మిస్ యూ ఫ్రెండ్స్" అంటూ సాత్విక్ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ లెటర్ ప్రతీ ఒక్కరిచేత కన్నీళ్లు పెట్టిస్తుంది.


అయితే ఘటన జరిగిన రోజున సాత్విక్ రాత్రి 7.30 సమయంలో తన తండ్రితో బాగానే మాట్లాడాడు. కానీ క్యాంపస్ లోని హాస్టల్‌లో ఉంటున్న సాత్విక్.. రాత్రి 10 గంటల సమయంలో.. క్లాస్‌రూంలోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. చదువుకి సంబంధించి లెక్చరర్లు అదే పనిగా ఒత్తిడి చెయ్యడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అతని ఫ్రెండ్స్ అంటున్నారు. సరగా చదవట్లేదనీ, ఫెయిల్యూర్ అనీ కించపరచడమే కాకుండా.. అందరి ముందూ సాత్విక్‌ని కొట్టేవారనీ.. ఆ అవమానాలు భరించలేకపోయాడని అంటున్నారు. కాలేజీ యాజమాన్యం సాత్విక్‌ని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తామే బైకర్‌ని లిఫ్ట్ అడిగి.. సాత్విక్‌ని ఆస్పత్రికి తరలించామని చెబుతున్నారు. ఐతే.. ఆస్పత్రికి చేరేలోపే.. సాత్విక్ చనిపోయాడని అంటున్నారు.

ఈ కేసులో నలుగురి అరెస్ట్ తో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వీరిని పోలీసు కస్టడీకి ఇస్తే కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.

Post a Comment

Previous Post Next Post