మూడు రాజధానుల ఉపసంహరణపై రైతుల హర్షం
అమరావతి: మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతం, మహాపాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసింది.
స్పష్టత కోరిన త్రిసభ్య ధర్మాసనం..
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తి స్పష్టతతో చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతోందని.. మరి కాసేపట్లో ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. మూడు రాజదానుల బిల్లును మాత్రం ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని ఏజీ స్పష్టం చేశారు. అయితే తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉండబోతోందో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారని కోర్టుకి నివేదించారు. దీంతో విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
కాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన..
మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సీఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయనున్నారు.
మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం
అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన