ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతులు మంజూరు


కృష్ణపట్నం గ్రామం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్యను కలిసి, అభినందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి 

 ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు, ఆనందయ్యకు అభినందనలు తెలియజేస్తున్నా.

 ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమందికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది.
ఆనందయ్యకు  కాకాణి అభినందన

👉 ఆనందయ్యకు ఆయుర్వేదం పట్ల అపారమైన అనుభవం ఉండడంతో పాటు, ఆనందయ్య మందు పట్ల ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం, విశ్వాసం గమనించిన  మీదట అన్ని విధాలా అండగా నిలిచాం.

👉 ఆనందయ్యకు అన్ని విధాలా అండగా నిలిచి, ఆయుర్వేద మందు అనుమతుల సాధన కోసం ప్రయత్నించి,  ప్రభుత్వ అనుమతితో మందు పంపిణీ చేసే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నా.

👉 ఆనందయ్య మందు విషయంలో కొంతమంది రాజకీయ రగడ సృష్టించడానికి ప్రయత్నించినా, ఆనందయ్య ఆయుర్వేద మందు వివాదాస్పదం కాకుండా, ఓర్పుగా నడుచుకున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య ఆధ్వర్యంలో ఆయుర్వేద మందు తయారు చేయించి, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా, నేరుగా ఇళ్ల వద్దకే మందు చేర్చే ప్రయత్నం చేస్తాం.

 ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం వేచి చూసిన ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అనుమతి లభించడం, గొప్ప శుభవార్త.

ప్రభుత్వం, అధికారుల సూచనలు, సలహాల ప్రకారం నడుచుకొని సంపూర్ణ సహాయ, సహకారాలు అందించిన ఆనందయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

Post a Comment

أحدث أقدم