వైద్యం అందక రోడ్డుపక్కనే మహిళ మృతి


రాజాం: సకాలంలో వైద్యం అందక శ్రీకాకుళం జిల్లాలో కరోనా బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. కొవిడ్ లక్షణాలతో వచ్చిన మహిళలను చేర్చుకోవడానికి ప్రైవేటు ఆస్పత్రి నిరాకరించడమే ఈ దారుణానికి కారణమైంది. ముందుగా కొంత సొమ్ము చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో చెల్లిస్తామని బాధితురాలు చెప్పినా ఆస్పత్రి సిబ్బంది వినలేదు. ఏటీఎంలో నగదు తీసుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈలోపు ఆస్పత్రి బయట రోడ్డు పక్కనే మహిళ మృతిచెందింది. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మృతురాలు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

Corona: వైద్యం అందక రోడ్డుపక్కనే మహిళ మృతి


Post a Comment

أحدث أقدم