today న్యూస్ హెడ్లైన్స్


     ANWtv

1. ఖాళీల జాబితా తయారీ

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటన చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీల సమాచారం ఇవ్వాలని సీఎం సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వాస్తవానికి ఉద్యోగుల పీఆర్‌సీ, పదవీ విరమణ వయోపరిమితి పెంపుతో పాటు ఖాళీల భర్తీపైనా ప్రకటన చేయాలని సీఎం భావించారని సమాచారం. ప్రభుత్వ శాఖల్లో రూపొందించిన జాబితాలో డిసెంబరు నెలాఖరు వరకే సమాచారం ఉన్నట్లు అధికారులు తెలియజేయడంతో...ఫిబ్రవరి నెలాఖరు వరకు కావాలని సీఎం సూచించారు. 

2. ‘టెన్త్‌’లోపు బడులన్నీ మూసేస్తేనే మేలు

కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే పదోతరగతిలోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తేనే మేలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నాక ఒకటీ, రెండురోజుల్లో ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు కరోనా వేగంగా వ్యాప్తిచెందడానికి వాహకులుగా మారుతున్నట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. 

3. జిన్‌పింగ్‌ కబంధహస్తాల్లో చైనా

అధికారం ఒక మత్తు... అది తలకెక్కితే పతనం తప్పదు. నియంతను తలపిస్తున్న జిన్‌పింగ్‌ పాలనలో చైనా ప్రస్థానంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వారసుడి ఊసే లేకుండా ఆ దేశ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశం ఇటీవలే ముగిసింది. అందులో 2035 వరకు అభివృద్ధి ప్రణాళికలను చర్చించారు. 2022 నవంబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) జనరల్‌ సెక్రటరీగా జిన్‌పింగ్‌ పదవీకాలం ముగియనుంది. ఆ తరవాత అధ్యక్ష పదవి రెండోవిడత పూర్తవుతుంది. కానీ, 2018లో ‘రెండు పర్యాయాల’ నిబంధనను తొలగించడంతో భవిష్యత్తులో ఆయన పదవి నుంచి తప్పుకోకపోవచ్చు. 

4. ఏడేళ్లలో 556% పెరిగిన పెట్రో సుంకం ఆదాయం

పెట్రోలు, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గత ఏడేళ్లలో 556 శాతం మేర పెరిగింది. కేంద్ర ఎక్సయిజ్‌ సుంకం పెంపే ఇందుకు కారణం. మోదీ అధికారం చేపట్టిన 2014-15లో పెట్రోలుపై ఎక్సయిజ్‌ సుంకం ద్వారా రూ.29,279 కోట్లు, డీజిల్‌పై సుంకం ద్వారా రూ.42,881 కోట్లు వసూలయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి పది నెలల్లో ఈ రెండింటి ద్వారా రూ.2.94 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. 

5. ‘కుటుంబ పింఛను’లో కుమార్తెలకూ వాటా

ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ తర్వాత కన్నుమూసిన ఉద్యోగులకు సంబంధించిన వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పింఛను పొందేందుకు అనర్హులుగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. 2019 నవంబరు 25న ప్రభుత్వం జారీ చేసిన జీవో 152ను రద్దు చేసింది. పిటిషనర్లకు గతంలో చెల్లించిన మాదిరిగానే కుటుంబ పింఛను ఇవ్వాలని అలాగే నిలిపివేసిన దగ్గర్నుంచి 6 శాతం వడ్డీతో బకాయిలను 2 నెలల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు ఇటీవల కీలక తీర్పు

6. అక్షయంగా మారనీయొద్దు!

క్షయ నిర్మూలనకు మొండి క్షయ పెద్ద సవాలుగా మారింది. క్రమం తప్పకుండా, పూర్తికాలం మందులు వేసుకుంటే క్షయ పూర్తిగా నయమవుతుంది. దీనికి మంచి చికిత్స అందుబాటులో ఉంది. ప్రభుత్వం ఉచితంగానూ అందిస్తోంది. అయితే లక్షణాలు తగ్గుముఖం పట్టగానే జబ్బు నయమైందనుకొని ఎంతోమంది మందులను మధ్యలోనే మానేయటం చిక్కులు తెచ్చిపెడుతోంది. దీంతో క్షయ కారక బ్యాక్టీరియా మందులను తట్టుకొనే శక్తిని సంతరించుకొని మొండిగా (ఎండీఆర్‌టీబీ) మారుతోంది. బరువుకు తగిన మోతాదులో మందులు వేసుకోకపోవటం, డాక్టర్‌ సూచించిన జాగ్రత్తలను పాటించకపోవటం కూడా దీనికి కారణమవుతున్నాయి. 

7. గృహిణిని వెంటాడుతున్న టీనేజీ ప్రేమ

పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయురాలిని టీనేజీ ప్రేమ వేధింపులకు గురి చేస్తోంది. డెంటల్‌ కాలేజీ లో చదివే రోజుల్లో తీసుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండగా, వాటిని తొలగించాలని లేఖలు రాసినా ఆయా సంస్థలు స్పందించకపోవడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నగ్న చిత్రాలను తీసుకున్నాడని, 8 నెలల తర్వాత వారు విడిపోయారని పేర్కొన్నారు. 

8. ఆమెకు వేతనమిస్తే తప్పేంటి?

విలక్షణ నటనతో వెండి తెరపై కథానాయకుడిగా వెలుగొందుతున్న కమల్‌ హాసన్‌ రాజకీయాల్లో సిసలైన నాయకుడిగా ఎదగడంపై దృష్టిసారించారు! తాను స్థాపించిన ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ పార్టీని తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దించారు. కోయంబత్తూరు (దక్షిణ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కమల్‌ తమ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకొని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. కమల్‌ ‘ఈటీవీ భారత్‌’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ పార్టీని భాజపా రెండో జట్టుగా కొంతమంది అభివర్ణిస్తుండటం సహా గృహిణులకు వేతనం, రిజర్వేషన్లు తదితర పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ విశేషాలివీ..

9. 96 రోజులుగా అప్పర్‌ సర్క్యూట్‌!

క షేరు విలువ ఒక ట్రేడింగ్‌ రోజులో గరిష్ఠంగా పెరిగేందుకు అనుమతించే పరిమితే అప్పర్‌ సర్క్యూట్‌.. గత 96 రోజులుగా, ఒక షేరు ధర రోజూ అప్పర్‌ సర్క్యూట్‌ అయిన 5% పెరుగుతూ వస్తోంది. మూడు నెలల వ్యవధిలోనే ఆ షేరు ధర 10000% పెరగడం స్టాక్‌మార్కెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ కంపెనీ.. ఆర్చిడ్‌ ఫార్మా. ఈ షేరు విలువ ఎందుకు ఇంతలా పెరుగుతోంది, ఆ కంపెనీల్లో ఏదైనా ప్రత్యేకత ఉందా.. అనేది ఆసక్తికర విషయం. 

10. క్రికెట్‌ పిచ్‌పై కవిత!

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) రాజకీయాల్లో ఊహించని పరిణామం  చూడబోతున్నామా? హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహారుద్దీన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌యాదవ్‌ల మధ్య   సవాళ్లతో వేడెక్కిన క్రికెట్‌ పిచ్‌పైకి కొత్త బ్యాటర్‌ రానున్నారా? అవుననే అంటున్నాయి స్థానిక క్రికెట్‌ వర్గాలు. క్రికెట్లో హైదరాబాద్‌ పేరు ఆట కంటే ఎక్కువగా వివాదాల్లోనే వినిపిస్తుండడంతో.. సీఎం  కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్‌సీఏపై దృష్టి పెట్టారు! 

Post a Comment

أحدث أقدم