TODAY NEWS HEADLINES LIVE

*అమ్మకానికి గాలి మేడలు

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో సరికొత్త దందా నడుస్తోంది. అనుమతులు రాకుండానే.. రెరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను ప్రీలాంచ్‌ పేరుతో కుప్పలుతెప్పలుగా విక్రయిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు కొందరు బిల్డర్లు. తక్కువ ధర అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిస్తూ కొనుగోలుదారుల నుంచి మొత్తం సొమ్ము ముందే కట్టించుకుంటున్నారు. మూడునాలుగేళ్లలో నిర్మాణం పూర్తయ్యేసరికి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు విలువ పలుకుతుందని నమ్మబలుకుతున్నారు.  

*బ్యాంకులకు వరుస సెలవులు

 బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ అయిదో తేదీ మధ్య బ్యాంకులకు నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఉన్నాయి. వీటిలో మూడు రోజులు (మార్చి 30, 31, ఏప్రిల్‌ 3) మాత్రమే నేరుగా బ్యాంకు శాఖల ద్వారా ఖాతాదార్లకు సేవలు అందనున్నాయి. ఏప్రిల్‌ ఒకటిన బ్యాంకులకు పనిదినమైనా ఆ రోజు కొత్త ఆర్థిక సంవత్సరం (అకౌంటింగ్‌ సంవత్సరం) ప్రారంభం నేపథ్యంలో లావాదేవీలు జరగవు. నాలుగో శనివారం, రెండు ఆదివారాలు, హోలీ, గుడ్‌ఫ్రైడే, బాబూ జగ్జీవన్‌రాం జయంతి నేపథ్యంలో ఆరురోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.  

*వార్షిక పరీక్షలుంటాయా?

పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయా? రాష్ట్రంలో విద్యాసంస్థలన్నింటినీ బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఇది. ఇంటర్‌ పరీక్షలు మే 1 నుంచి 19 వరకు, పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి 26 వరకు జరుగుతాయని ప్రభుత్వం నెల క్రితమే ప్రకటించింది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను 30 శాతం వరకు తగ్గించడంతోపాటు ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. 

*రూపాయికే 300 చ.అ. టిడ్కో ఇల్లు

పురపాలక సంఘాల్లో షియర్‌వాల్‌ సాంకేతికతతో జీ+3 అపార్ట్‌మెంట్‌ తరహాలో నిర్మించిన 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,43,600 ఇళ్లను ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 365 చ.అడుగులు, 430 చ.అ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు లబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది. 365 చ.అ ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ ఇంటికి రూ.లక్ష తమ వాటాగా లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా ఇందులో 50 శాతం రాయితీకి అనుమతిచ్చింది. 

*జీవకణంలో జవాబు దొరకని ప్రశ్నలు

జీవకణశాస్త్రంలో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అనుదినం శరీరంలోని ప్రతి జీవకణం నిరంతరం ఎన్నెన్నో మార్పులు చెందుతుంటుంది. ఒక్కోసారి ఇవి అవసరానికి మించి విభజనకు లోనవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో శరీర రక్షణ వ్యవస్థ అప్రమత్తమై వాటిని శరీరం నుంచి బహిష్కరిస్తుంది. కొన్ని సార్లు అత్యంత అరుదుగా  విభజిత కణాలు శరీర రక్షణ వ్యవస్థపై విజయం సాధిస్తాయి. దీంతో ఊహించని స్థాయిలో కణాల పెరుగుదల ఎక్కువై క్యాన్సర్‌కి దారి తీస్తాయి. 

*సైట్‌లను యాప్‌లుగా మార్చేద్దాం!

ఎక్కువ యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే ఏమవుతుంది? ప్రాసెసింగ్‌ వేగం తగ్గుతుంది.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అంతేకాదు.. యాప్‌లన్నీ రకరకాల అనుమతులు కోరుతూ మీ డేటాపై ఓ కన్నేస్తుంటాయి. అందుకే వీలైనంత వరకూ యాప్‌ల వాడకాన్ని ఫోన్‌లో తగ్గించాలంటే? ఏముందీ.. ఆయా యాప్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌లను ఫోన్‌లో యాప్‌లుగా ఓపెన్‌ చేస్తే పోలా! అంటే.. పదే పదే బ్రౌజర్‌ ద్వారా వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేయకుండా.. సింపుల్‌గా ఒక్కసారి ట్యాప్‌ చేసి యాప్‌ల మాదిరిగా వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేయడం అన్నమాట. నెట్టింట్లో మీరు యాక్సెస్‌ చేస్తున్న చాలా వరకూ వెబ్‌సైట్‌లను ఈ తరహా యాప్‌లుగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం! 

*లాఠీతో బాదారు.. బూటు కాలితో తన్నారు!

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పోలీసులు ఒక యువకుడిని దారుణంగా కొట్టారు. పైకి పొక్కకుండా దాచబోయారు. కానీ సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు స్పందించి నలుగురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన ఈ ఘటన వివరాలు... పట్టణానికి చెందిన వాజిద్‌ (35) తన బొలెరో వాహనంలో కొందరిని ఎక్కించుకొని సోమవారం సాయంత్రం సింగూరు వైపు వెళుతున్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపాలని కోరారు. 

*ఆస్ట్రాజెనెకా టీకా ఫలితాల్లో ‘పాత డేటా’!

ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్‌-19 టీకాపై తమ దేశంలో నిర్వహించిన క్లినికల్‌ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలపై అమెరికా అనుమానాలు వ్యక్తంచేసింది. ఆ వివరాల్లో ‘పాత డేటా’నూ వినియోగించి ఉండొచ్చని పేర్కొంది. దీనివల్ల ఆ వ్యాక్సిన్‌ సమర్థత వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని ఆ దేశ ఫెడరల్‌ ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. అయితే తమ డేటాలో ఫిబ్రవరి 17 వరకూ నమోదైన కేసుల వివరాలు ఉన్నట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది.  

*తల తెగినా.. హాయిగా బతకగలదు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు.. ఎన్నెన్నో వింతలున్నాయి కదా! జీవుల్లో కొన్ని అరుదైనవి ఉంటాయి.. ఇంకొన్నింటికి ప్రత్యేకతలు ఉంటాయి. నీటిలో నివసించే అలాంటి ఓ ప్రత్యేక జీవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..!! సాధారణంగా బల్లులు వాటి తోక తెగినా.. తిరిగి నిర్మించుకోగలవని తెలిసే ఉంటుంది. అలాగే కొన్ని చేపలు, చిన్న చిన్న జంతువులు కాళ్లు, తోకలాంటి అవయవాలు కోల్పోతే మళ్లీ పెంచుకుంటాయి. కానీ,  సాకోగ్లోస్సాన్‌ అనే జాతికి చెందిన నత్తలు ఏకంగా తల తెగినా.. మళ్లీ శరీరాన్ని సృష్టించుకొని బతకగలవట. 

*ఆరంభం అదిరింది

లక్ష్యం 318. 13 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు 135/0. టీమ్‌ఇండియా ఎంతో కష్టపడి నిలిపిన లక్ష్యాన్ని ప్రత్యర్థి అలవోకగా కరిగించేస్తుంటే తీవ్ర అసహనం! ఈ వేగంలో వెళ్తే ప్రత్యర్థి 40-45 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేస్తుందంటూ నిట్టూర్పులు! అయితే నిజంగానే మ్యాచ్‌ పూర్తి ఓవర్లు సాగలేదు. 42.1 ఓవర్లకే అయిపోయింది. కానీ మ్యాచ్‌ను ముగించింది ఇంగ్లాండ్‌ కాదు.. భారత్‌! 135 పరుగులకు గానీ తొలి వికెట్‌ తీయలేకపోయిన టీమ్‌ఇండియా.. 116 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థికి దిమ్మదిరిగే షాకిచ్చింది.

Post a Comment

Previous Post Next Post