ప్రభుత్వాస్పత్రిలో అమానుషం మహిళను ఈడ్చిపారేసిన గార్డు



భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్‌ జిల్లా ఆస్పత్రిలో గురువారం అమానుష ఘటన చోటుచేసుకుంది. చికిత్స చేయాల్సిన ఓ మహిళను ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు 300 మీటర్లు దూరం లాక్కెళ్లి గేటు బయట పడేశాడు. మధ్యలో బురదలోనూ అలాగే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆస్పత్రి అధికారులు స్పందించి.. ఆ గార్డును తొలగించారు. అయితే ఆమె పట్ల ఎందుకలా అమానుషంగా ప్రవర్తించారో చెప్పేందుకు నిరాకరించారు. బాధిత మహిళకు మతిస్థిమితం లేదు. ఎవరో ఆమెను తీసుకొచ్చి ఆస్పత్రిలో వదిలేసి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది సూచనలతో గార్డు ఇలా చేసినట్టు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post