హైదరాబాద్, న్యూస్‌టుడే: ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం ఠాణా పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం.. ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసే శిరిష్మకు మణికొండ ట్రయల్ విల్లాస్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016లో వివాహం జరిగింది. వీరు ఏడాదిగా గచ్చిబౌలి డీ అడ్రెస్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు సంతానం లేదు. సిద్ధార్థ్ బుధవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి శిరిష్మ గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. గురువారం శిరిష్మ తండ్రి చలసాని శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చలసాని శ్రీనివాస్ కుమార్తె అనుమానాస్పద మృతి
AMARAVATHI NEWS WORLD
0