ఏపీలో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్

‌ 
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1.30 గంటలకు పోలింగు ముగిశాక ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. పోలింగ్‌ నిర్వహణ కోసం 85,416 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.


ఏపీలో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్‌ 


 నోటిఫికేషన్‌ ఇచ్చిన 3,328 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 8న 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో మూడు పంచాయతీలకు నామినేషన్లు రాకపోవడంతో వాటిని మినహాయించి 2,786 సర్పంచి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 7,507 మంది పోటీ పడుతున్నారు. 33,570 వార్డు సభ్యుల స్థానాల్లో 12,604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో ఒక్క నామినేషన్‌ కూడా పడలేదు. మిగిలిన 20,817 స్థానాలకు 44,876 మంది పోటీలో ఉన్నారు.

ఏపీలో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్‌ 

29,304 పోలింగు కేంద్రాలు
ఎన్నికల కోసం 29,304 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 5,480 సున్నితమైన, మరో 4,181 అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు.  మైదాన ప్రాంతాల్లో 2.30 నుంచి 3.30 వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 12.30 నుంచి 1.30 గంటల వరకు కొవిడ్‌ సోకినవారు ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఓటర్లను థర్మల్‌ స్కానింగ్‌ చేశాకే పోలింగు కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. సున్నిత, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పోలింగును ‘వెబ్‌ కాస్టింగ్‌’ విధానంలో పరిశీలించి తగిన ఆదేశాలిచ్చేలా తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయంలో కమాండు కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పరిస్థితిని కూడా ఇక్కడి నుంచే ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు.


Post a Comment

أحدث أقدم