పెళ్లి తర్వాత సునీత మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్క రేంజ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది సింగెర్స్ లో ఒక్కరు సునీత, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గులాబీ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఎం చేస్తూ ఉంటావో’ అంటే పాట ద్వారా ప్రారంభించిన తన సినీ రంగ ప్రస్థానం ఇన్ని సంవత్సరాలకు గాను ఆమె 7 వేల పాటలకు పైగానే పాడింది,ప్రతి ఏడాది కొత్తగా ఎంత మంది టాలెంటెడ్ సింగర్స్ పుట్టుకొస్తున్న కూడా సునీత గారి డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె రేంజ్ ఎలాంటిదో, ఇక ఇటీవలే రామ కృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సునీత తన కొత్త జీవితం ని ఘనంగా ప్రారంబించింది, వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి,ఇది ఇలా ఉండగా ఇంతకాలం ఎంతో కూల్ గా ఎప్పుడు కోపంగా కనిపించని సునీత గారు , ఇటీవల ఒక్క వ్యక్తిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెను సంచలనం రేపుతున్నాయి, ఆ వ్యక్తి ఎవ్వరు? , సునీత గారికి అంతలా కోపం తెప్పించే పని ఏమి చేసాడు అనేది ఇప్పుడు మనం ఈ కథనంలో చూడబోతున్నాము.
సోషల్ మీడియా బాగా వృద్ధి చెందడం తో కొంతమంది స్టార్ హీరోల పేర్లు మరియు స్టార్ హీరోయిన్ల పేర్లు వాడుకొని చాలా మంది ఘరానా మోసాలు చేస్తూవస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఆయా సెలెబ్రిటీలు పడే పడే నమ్మి మోసపోకండి అని వారిస్తున్నా కూడా ఈ ఈ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి, అలా సింగర్ సునీత పేరు వాడుకొని ఒక్క దుండగుడు అమాయకులు అయినా నెటిజన్స్ నుండి లక్షల రూపాయిలు దోపిడీ చేసాడు, ఈ విషయమై సునీత చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది, ఆమె మాట్లాడుతూ ‘నా అభిమానులందరికి నమస్కారం, నేను ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగానే ఉంటూ వస్తాను, నా ప్రొఫెషన్,నా పిల్లలు మరియు నా భర్త, నాకు తెలిసిన ప్రపంచం ఇదే, ఎవరు నా గురించి ఎలా మాట్లాడుకున్న స్పందించకుండా నా పని ని నేను చేసుకుంటూ పోతాను, కానీ ఇప్పుడు మీ అందరికి ఒక్క విషయం కచ్చితంగా చెప్పాల్సి ఉంది, అది నా బాధ్యత, కచ్చితంగా చెప్పే తీరాలి’.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇటీవలే పేపర్ లో ఒక్క ఆర్టికల్ వచ్చింది,ఎవరో చైతన్య అనే అబ్బాయి అట, అనంతపురం లో ఉంటాడు అట, ఎంతోమందికి నా పేరు చెప్పి మరియు నా ఫామిలీ పేరు చెప్పి ఎంతో డబ్బులు దండుకుంటున్నారు అట, నాకే తెలియని నాకో మేనకోడలు అట,నా కూతురు మరియు కొడుకు పేర్లు, ఇలా కుటుంబంలో ఉన్న అందరి పేర్లు వాడుకొని అమాయకులైన జనాలకు మాయ మాటలు చెప్పి మోసం చేసి డబ్బులు దండుకుంటున్నాడు అట,వాడెవడో నాకు కనిపిస్తే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను, దయచేసి ఇలాంటి నీచుల్ని నమ్మి మోసపోకండి, అసలు ఇంత చదువులు చదివి అంత తేలికగా అలాంటి మాయ గాళ్ళ వలలో ఎలా పడుతున్నారు?,దయచేసి గమనించండి, నేను ఈ విషయం ని అంత తేలికగా వదలను, పోలీసులకు కంప్లైంట్ చేస్తాను, వాడి అంతు తెలుస్తాను, దయచేసి నా పేరు వాడుకొని చైతన్య పేరు తో ఎవ్వరు వచ్చిన నమ్మి మోసపోకండి, కనీసం ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన తిరస్కరించండి, ఇది మీ అందరికి చెప్పడం నా బాధ్యత, వాడు కనిపిస్తే మాత్రం నా చేతిలో మాములు గా ఉండదు’ అంటూ సునీత చెప్పుకొచ్చింది.

Post a Comment

أحدث أقدم