
హైదరాబాద్: ఇటీవల గుజరాత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు కనకంబట్ల వెంకటేశ్వరశర్మ శుక్రవారం కన్నుమూశారు. విహార యాత్రలో భాగంగా జనవరి 24వ తేదీ తెల్లవారు జామున సోమనాథ ఆలయానికి వెళ్తుండగా ద్వారక్ వద్ద ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్‌బజార్ వేణుగోపాలస్వామి దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ రమణ అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశ్వరశర్మ, ఈవో సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉండటంతో అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వరశర్మ ఇవాళ మృతి చెందారు.