ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

 

అపస్మారకస్థితిలో ఉన్న పృథ్వీ, ఫరానా

 తాడేపల్లిరూరల్‌(మంగళగిరి): తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక, ఉండవల్లి శివార్లలో అనంతపద్మనాభస్వామి గుహల వెనుక భాగంలో ప్రేమికుల జంట మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువకుడు మృతి చెందగా, యువతి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరికీ 108 అంబులెన్సులో  వైద్య పరీక్షలు నిర్వహించారు. యువతి బతికే ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతి చెందిన యువకుడు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలం ముప్పాళ్లపాడు గ్రామానికి చెందిన పృథ్వీ (25)గా గుర్తించారు. వెంటనే అతని తండ్రి గోపాలరెడ్డికి సమాచారం ఇచ్చారు. యువతి హైదరాబాద్‌కు చెందిన పండ్ల వ్యాపారి కూతురు ఫరానాగా తెలిసింది. కాగా, పృథ్వీ హైదరాబాద్‌లో పండ్ల దుకాణంలో పనిచేయడానికి 2020 జనవరిలో వెళ్లాడు. అప్పటినుంచి పండ్ల షాపు యజమాని కూతురు ఫరానాని ప్రేమించి 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన గుంటూరుకు తీసుకొచ్చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఎస్‌ఐ నారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم