చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. రామన్నగూడ గ్రామంలో ఓ మహిళ తాగిన మత్తులో కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది. మంగళవారం సాయంత్రం కల్లు తాగిన పరమేశ్వరి అనే మహిళ రాత్రి సమయంలో ఆ మత్తులో తన కుమారుడు ధనుష్(2)ను హత్య చేసింది. మద్యం తాగొద్దని ఆమె మామ మందలించడంతో ఆగ్రహానికి గురైన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.
మద్యం మత్తులో కుమారుడిని చంపిన తల్లి
AMARAVATHI NEWS WORLD
0