తస్మాత్‌ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు


లైసెన్స్‌ లేని వారికి వాహనం ఇస్తే జైలుకే..

మూసాపేట: తెలిసిన వారే కదా అని డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి వాహనం ఇచ్చిన, ప్రమాదాలు జరిగినప్పుడు వాహనం యజమానే నిందితుడిగా అవుతారు. ఇతరుల వాహనం నడిపే క్రమంలో లైసెన్స్‌ లేని వ్యక్తి ప్రమాదం బారిన పడితే వాహనం యజమాని జైలుకు వెళ్లిన ఘటన తాజా కేసుతో ఈ విషయం వెల్లడైంది.

స్నేహితురాలికి తన స్కూటీ ఇస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్కూటీ యజమాని అయిన స్నేహితుడిని ప్రధాన నిందితుడిగా చేస్తూ, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను రెండవ నిందితుడిగా పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని ఆది రేష్మా మరణించిన విషయం విదితమే. ఈ  కేసులో స్కూటీ యజమాని అజయ్‌సింగ్‌ (23), హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టూడెంట్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

Post a Comment

أحدث أقدم