మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం :ఆరుగురి మృతి


మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీ కొని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఎర్రకుంట తండా వాసులు. ఇటీవలే కుమార్తె పెళ్లి కుదరడంతో నూతన దుస్తుల కొనుగోలు కోసం వధువుతో సహా వరంగల్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ కిందకు వెళ్లిన ఆటోను ప్రొక్లెయినర్‌ సాయంతో బయటకు తీశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

కేసీఆర్‌ దిగ్భ్రాంతి

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Post a Comment

أحدث أقدم