వివాహేతర బంధం.. స్నేహితుడి హతం


వివాహేతర బంధం.. స్నేహితుడి హతం

అశోక్‌(పాతచిత్రం)

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తిఆర్‌.ఎస్‌.లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ పెయింటర్‌ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డు ఉండకూడదని పథకం ప్రకారం స్వయాన స్నేహితుడే అతడిని మట్టుపెట్టాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు గుత్తిఆర్‌.ఎస్‌.లోని తోళ్లషాపులో నివాసం ఉంటున్న అశోక్‌, యోగి మంచి మిత్రులు. ఇద్దరూ పెయింటర్లుగా పని చేస్తున్నారు. యోగి మిత్రుడు కావడంతో అతడిని అశోక్‌ తరచూ తన ఇంటికి పిలిచేవాడు. ఈ నేపథ్యంలో యోగికి అశోక్‌ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన అశోక్‌ తన భార్యను పద్ధతి మార్చుకోమని హెచ్చరిస్తూ వస్తున్నాడు. దీంతో భర్త అశోక్‌ అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య వెంకటలక్ష్మి అతడిని చంపాలని ప్రియుడిని పురమాయించింది. దీంతో యోగి అశోక్‌ను మందు పార్టీ పేరుతో స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ పూటుగా మద్యం తాగారు. మద్యం మత్తులో అశోక్‌ను కత్తితో పొడిచి చంపాడు. హత్య సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సీఐ రాము, ఎస్‌ఐ గోపాలుడు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Post a Comment

Previous Post Next Post