వారిని దాటుకుని ఎలాగోలా సిద్ధార్థ్ ఇంటికి చేరుకున్న ఆమె అతడిని వెంటేసుకుని భోజనానికి వెళ్లొచ్చారట. మొత్తానికి బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ కెమెరాకు దొరికిపోయిన కియారా ఫొటోలు ప్రస్తుతం బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌లోనూ ఈ జంట 2020కి గుడ్‌బాయ్ చెప్పేందుకు మాల్దీవులకు వెళ్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కింది. ఇదిలా వుంటే కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. దీనికి విష్ణువర్దన్ దర్శకత్వం వహించగా కరణ్‌జోహార్ సహనిర్మాతగా వ్యవహరించాడు.