నాగోలు, న్యూస్‌టుడే: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ కథనం ప్రకారం.. చెన్నైలో పుట్టిన బొందిలి సందీప్‌సింగ్(38) నగరంలోని బేగంపేటలో తల్లిదండ్రులతో కలిసి నివసించాడు. పదకొండేళ్ల క్రితం రాజస్థాన్‌కు చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. కొవిడ్ కాలంలో డబ్బు లేక ఆన్‌లైన్ మోసాలకు తెగబడ్డాడు. 5 భాషల్లో ధారాళంగా మాట్లాడేవాడు. ఐవోసీఎల్, హెచ్‌పీ ల్యాప్‌ట్యాప్, బీపీసీఎల్ వంటి సంస్థలకు దేశవ్యాప్తంగా అడ్వర్టయిజ్‌మెంట్ బోర్డులకు చెందిన డిజిటల్ ప్రింటింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ సంబంధిత ప్రింటింగ్ సంస్థల యజమానులకు చెప్పాడు. అతని మాటలు నమ్మిన నగరానికి చెందిన ఓ సంస్థ యజమాని బిడ్డింగ్ కోసమని రూ.3,63,105 నగదును చెల్లించాడు. వెంటనే నిందితుడు తన ఫోన్‌ను స్విఛాఫ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. సందీప్ తన బావమరిది బన్నాలాల్ బవారియాతో కలిసి పలు సిమ్‌కార్టులు తెప్పించి పేటీఎం, ఫోన్‌పేతోపాటు ఇతర బ్యాంకు అకౌంట్లు సృష్టించాడు. అక్రమంగా సంపాదించిన సొమ్మును పెట్రోలు బంకుల్లో డ్రాచేయించేవాడు. రాజస్థాన్‌లోని పెట్రోలు బంకుల్లోని సీసీ ఫుటేజీల ఆధారంగా సందీప్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంట్రాక్ట్ పేరుతో రూ.లక్షలు కాజేశాడు
AMARAVATHI NEWS WORLD
0