మళ్లీ బాదుడే బాదుడు.. పెరిగిన పెట్రోల్‌ ధరలు


మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు..

న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. గత ఐదు రోజుల విరామం అనంతరం బుధవారం ధరలను చమురు సంస్థలు పెంచగా.. వరుసగా రెండో రోజు గురువారం ధరలను పెంచాయి. దేశ రాజధానిలో లీటరుకు 25 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ ధర రూ.84.70కి చేరింది. డీజిల్‌పై సైతం లీటర్‌కు 25పైసలు పెరగడంతో లీటర్‌ ధర 74.88కు చేరింది. తాజా పెంపుతో జైపూర్‌లో పెట్రో, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరుకున్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.54, డీజిల్‌ రూ.84.53కు చేరింది. అలాగే పెట్రోల్‌ ధర హైదరాబాద్‌లో లీటర్‌కు రూ.88.11, కోల్‌కతాలో రూ.86.15, ముంబైలో 91.32, చెన్నైలో రూ.87.40, బెంగళూరులో రూ.87.56, భువనేశ్వర్‌ రూ.85.36, పాట్నాలో రూ.86.73కు చేరింది. డీజిల్‌ రేట్లు కోల్‌కతాలో రూ.78.47, ముంబైలో రూ.81.60, చెన్నైలో రూ.80.19, బెంగళూరు రూ.79.70, హైదరాబాద్‌లో రూ.81.72, పాట్నాలో రూ.80.46కు చేరింది.

Post a Comment

أحدث أقدم