బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ : కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ ఫొటోస్

 

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయింది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ అలియాస్ అర్చన. సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూల ద్వారా ఎంతగానో ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చక్కని ఆటతీరుతో ఆకట్టుకుని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకుని దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!


యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆరియానా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో పని చేసింది. తన కెరీర్‌లో ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసిన ఆమె.. కొన్ని రోజుల క్రితం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో బోల్డుగా వ్యవహించడం.. ఆయన కూడా పచ్చి పచ్చిగా మాట్లాడడం వంటి వాటితో పాపులరై బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసింది.

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపికైనా ఆరియానా గ్లోరీ.. అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి మిగిలిన హౌస్‌మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్న ఆమె.. అల్లరి అల్లరి చేస్తూ తన హవా చూపించింది. రెండు రోజుల తర్వాత హౌస్‌లోకి వెళ్లి రచ్చ రచ్చ చేసింది. దీంతో కంటెస్టెంట్లందరికీ హెచ్చరికలు పంపింది.


బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ ఎంత సరదాగా ఉండేదో.. టాస్కుల సమయంలో మాత్రం అంతే సీరియస్‌గా కనిపించేది. తాను గెలవడం కోసం ఎంతటి పనైనా చేసే ఆమె.. ఎన్నోసార్లు స్వార్ధంగా ఆడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు, మరికొందరి విషయంలో క్రూరంగా వ్యవహరించిందన్న అపవాదును మూటగట్టుకుంది. ఇలా పలు గొడవల్లో భాగమై వార్తల్లో నిలుస్తూ వచ్చింది.


సాదాసీదా కంటెస్టెంట్‌గా ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. కానీ, ఊహించని రీతిలో ఆమె ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకుంది. అంతేకాదు.. ఏకంగా ఫినాలేలో అడుగు పెట్టింది. ఒకానొక దశలో ఆమెనే విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. అదే సమయంలో ఎన్నో టీవీ షోలలో పాల్గొంటోంది. వీటితో పాటు కొన్ని ఆఫర్లను కూడా అందుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బోల్డ్ బ్యూటీకి సంబంధించిన హాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతోంది.


గతంలో ఎప్పుడో ఆరియానా గ్లోరీ ‘అర్జున్ రెడ్డి' సినిమాలో హీరో చేసినట్లుగా సిగరెట్లు కాల్చుతూ.. బీరు తాగుతూ.. బైక్ నడుపుతూ ఓ వీడియో చేసింది. అప్పట్లో దానికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, తాజాగా దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు కొందరు. దీంతో ఇప్పుడు ఈ వీడియోకు విశేష స్పందన వస్తోంది. అంతేకాదు, దీనికి ఊహించని రీతిలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

Post a Comment

أحدث أقدم