ప్రేమించట్లేదని యువతిపై మచ్చుకత్తితో దాడి తెగిపడ్డ మూడు ఎడమ చేతి వేళ్లు రెండు వారాల క్రితమే చంపేస్తానని బెదిరింపు
గతంలో వాలంటీరుగా పనిచేసిన సునీల్
వివేకానంద కాలనీకి చెందిన సునీల్ గతంలో వాలంటీరుగా పనిచేసేవాడు. విధులకు సక్రమంగా రావట్లేదన్న కారణంతో గతేడాది అతడిని అధికారులు తొలగించారు. ప్రస్తుతం సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. సునీల్‌కు ఫేస్‌బుక్ ద్వారా ఈ యువతి పరిచయమైనట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
ఆదివారం విజయవాడకు వెళ్లాలి
ప్రొద్దుటూరులో ఇంటర్ చదివిన మా బిడ్డ విజయవాడలో బీటెక్ చదివేందుకు సిద్ధమైంది. ఆదివారం ఆమెను విజయవాడ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఈలోపే ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. సునీల్‌కుమార్ ఎన్నిసార్లు గొడవ చేసినా అమ్మాయి విషయమని సర్దుకుపోయాం. ఈ విషయాన్ని గతంలో పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాం.