కేసీఆర్‌ సమీప బంధువు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌


ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీప బంధువు, జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, అతని ఇద్దరి సోదరుల ఆచూకీ తెలిసింది. వారు సురక్షితంగా ఉన్నట్లు ప్రవీణ్‌రావు మరో సోదరుడు ప్రతామ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌కుమార్‌ పోలీసులు, మీడియాకి ధన్యవాదాలు చెప్పారు. కిడ్నాప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు.  

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మనోవికాస్‌ నగర్‌లోని తమ స్వగృహంలో ఉన్న ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావును మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో సినీ ఫక్కీలో దుండగులు అపహరించారు. మూడు కార్లలో వారి ఇంటికి వెళ్లిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్‌, చరవాణిలను కూడా పట్టుకుపోయారు. ఆ ముగ్గురు కిడ్నాప్‌నకు గురైనట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ప్రవీణ్‌రావు ఇంటి చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రవీణ్‌రావు కిడ్నాపైన విషయం తెలియడంతో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే అర్ధరాత్రి దుండగులు ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు గుర్తించారు. 

Post a Comment

Previous Post Next Post