అబార్షన్‌ గురించి చెబుతూ ఏడ్చేసిన యాంకర్: కత్తులు అనే సరికి తట్టుకోలేకపోయిన అనసూయ

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. ఎంతో మంది అమ్మాయిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టెలివిజన్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. వారిలో అతి తక్కువ మంది మాత్రమే తమ టాలెంట్లను నిరూపించుకుని సూపర్ సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో తెలుగందం అనసూయ భరద్వాజ్ ఒకరు. ఎంతో కాలంగా బుల్లితెరపై ప్రభావం చూపిస్తోన్న ఆమె.. స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అనసూయ ఓ విషయంలో బాగా ఎమోషనల్ అయింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

చదువు పూర్తి చేసిన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ' సినిమాలో చిన్న పాత్రను పోషించింది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. కానీ, అవకాశాలు దొరకకపోవడంతో ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. అప్పుడే అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె.. కెరీర్ ప్రారంభం అవక ముందే ప్రేమ వివాహం చేసుకుంది.

న్యూస్ ప్రజెంటర్‌గా చేస్తోన్న సమయంలోనే అనసూయకు ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్‌లో యాంకర్‌గా చేసే అవకాశం వచ్చింది. అలా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు, అద్భుతమైన నటన, ఆకట్టుకునే అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని సెలెబ్రిటీ అయింది.


సుదీర్ఘమైన కెరీర్‌లో సినిమాల్లోనూ నటించి మెప్పించింది అనసూయ. అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన'లో చిన్న పాత్రలో కనిపించిన ఆమె.. ఆ తర్వాత ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్ర విశేషమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. దీంతో ఎన్నో అవార్డులు దక్కాయి.


వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోన్న అనసూయ.. ఇటీవల ట్విట్టర్‌‌లో ‘ఓ ఈవెంట్‌ కోసం కర్నూలు వెళ్లేందుకు ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచాను. అప్పుడే నాకు కరోనా లక్షణాలు ఉన్నాయని గ్రహించి ప్రయాణాన్ని ఆపుకున్నాను. వెంటనే నేను టెస్ట్ చేయించుకుంటా. నాతో ఉన్న వాళ్లకూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరీక్ష చేయించుకుని, రిపోర్టును షేర్ చేయండి' అని పేర్కొంది.

ఈటీవీలో ప్రతి సంక్రాంతికీ ప్రత్యేకమైన కార్యక్రమానికి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సారి ‘అత్తో అత్తమ్మ కూతురో' అనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో రోజా, అనసూయ, రష్మీ ప్రధాన పాత్రలు పోషించగా.. జబర్ధస్త్ కమెడియన్లు, ఇతర ప్రముఖులు సందడి చేశారు. ఈ క్రమంలోనే సింగర్ మధు ప్రియ ‘అబార్షన్ల'పై ప్రత్యేక గీతాన్ని ఆలపించింది.


‘కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరు అయ్యే దేవుడా' అంటూ ఆలోచింపజేసిన ఈ పాటను మధు ప్రియ చక్కగా పాడింది. దీంతో అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. మరీ ముఖ్యంగా యాంకర్ అనసూయ భరద్వాజ్ దీనిపై స్పందిస్తూ.. ‘కత్తులు అవన్నీ అనగానే తట్టుకోలేకపోతున్నా. అయ్యో పాపం.. ఎన్ని ప్రాణాలు అలా పోయింటాయో' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.

Post a Comment

أحدث أقدم