కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ఐదేళ్ల బాలుడు నిషాంత్ మృతి చెందాడు. ఇంటిముందు ఉన్న మురికి కాల్వలో బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. నిన్న(గురువారం) మధ్యాహ్నం ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు ఇంటికి రాకపోవడంతో దేవునిపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంటి ముందు నిషాంత్.. శవమై కనిపించడంతో సద్గురు కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషాదం: అదృశ్యమైన బాలుడు మృతి
AMARAVATHI NEWS WORLD
0