నైజర్: పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు. మాలి సరిహద్దు వద్ద రెండు గ్రామాలపై దాడి చేసి దాదాపు 100 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై నైజర్ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి జరిగిన తోచబంగౌ, జారౌమ్‌దారే గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు సానుభూతి తెలియజేశారు.
శనివారం తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపారు. ప్రతికారేచ్ఛతో రగిలిపోయిన ఉగ్రవాదులు రెండు గ్రామాలపై దాడి చేసి వంద మందిని కాల్చి చంపారు. బోకోహారమ్ గ్రూపునకు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.