మీకు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉందా ? అకౌంట్లో డబ్బులు ఉన్నాయా ? కానీ అకౌంట్లో సొమ్ము కనపడడం లేదా ? ఖాతా ఖాళీ అని చూపిస్తోందా ? ఏటీఎంకు వెళ్లి డ్రా చేయలన్నా జీరో బ్యాలెన్స్ చూపిస్తోందా. అయితే కంగారుపడకండి.. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ లోని మీ డబ్బు ఎక్కడికీ పోలేదు, భద్రంగానే ఉంది. అయితే ఎక్కడికి పోయిందని మీ డౌట్ కదా.. కొన్నాళ్ళ కిందట ఆంద్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయింది. విలీన ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంక్ నుండి యూనియన్ బ్యాంక్ కు ఐటీ సిస్టం మారుతోంది. దీంతో నిన్నటి నుండి అంటే ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల నుండి 11 వ తేదీ ఉదయం ఆరుగంటల దాకా బ్యాంక్ ఖాతాలు పని చేయవు, ఈ మూడు రోజుల పాటు మీ అకౌంట్ బ్యాలేండ్ జీరో అనే చూపిస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక మీ పాత బ్యాలెన్స్ మీకు కనిపిస్తుంది.
ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ లోని మీ డబ్బు ఎక్కడికీ పోలేదు
AMARAVATHI NEWS WORLD
0