మేకప్‌ లేకుండా జెన్నీఫర్‌ లోపేజ్‌.. చూశారా?


అందంగా ఉన్న అమ్మాయిని చాలామంది జెన్నిఫర్‌ లోపెజ్‌తో పోల్చుతుంటారు. అంతెందుకు.. ‘జెన్నిఫర్‌ లోపెజ్‌ స్కెచ్‌ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరీ...’ అంటూ టాలీవుడ్‌లో ఓ సాంగ్‌ కూడా పాడేసుకున్నారు. ఔను మరి.. జెలో మామూలు అందగత్తె కాదుగా! ఆ మాటకొస్తే పాప్‌ ప్రపంచంలో తనని నేచురల్‌ బ్యూటీ, కాంతివంతమైన చర్మం ఉన్న సింగర్‌గా చెబుతుంటారు. అందుకే ఆమె పాట, ఆట, నటనకంటే అందానికే ఫ్యాన్స్‌ ఎక్కువ. అలాంటి సౌందర్యరాశి మేకప్‌ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఆ అరుదైన అవకాశం అభిమానులకిచ్చింది జెన్నిఫర్‌. ‘కొత్త ఏడాదికి ముందు మీకో సర్‌ప్రైజ్‌. ఇదీ నా అసలు రూపం’ అంటూ మేకప్‌ మొత్తం తీసేసి, ముఖాన్ని శుభ్రంగా కడిగేసి ‘ఎలా ఉన్నాను?’ అంటూ ఇన్‌స్టాలో ఫొటో పెట్టేసింది.

మేకప్‌ లేకుండా జెన్నీఫర్‌ లోపేజ్‌.. చూశారా?

ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. ‘అస్సలు పోల్చుకోలేకపోతున్నాం’ అని కొందరంటే.. ‘మేకప్‌ లేకపోయినా అందం అణువంతైనా తగ్గలేదు’ అని కామెంట్‌ చేశారు ఇంకొందరు. దానికి కొనసాగింపుగా ఈరోజు మరో వీడియో తీసి పెట్టింది జెలో. ఈమధ్యే  ‘జెలో బ్యూటీ’ పేరుతో ప్రారంభించిన సౌందర్యోత్పత్తులను వాడుతూ కెమెరా ముందుకొచ్చి మేకప్‌ వేసుకుంది. ఆ పని చేస్తూనే ‘డిక్‌ క్లార్క్‌ న్యూఇయర్స్‌ రాకిన్‌ ఈవ్‌’ సింగిల్‌కి సరదాగా నృత్యం కూడా చేసింది. పనిలో పనిగా స్కిన్‌కేర్‌ సూత్రాలు చెప్పింది. ‘మొన్నటి వాష్‌అవే ఈవెంట్‌ 2020 తర్వాత 2021లో ఇదే నా ఫ్రెష్‌ ఫేస్‌’ అంటూ ఊరించింది. ఇంకేం.. కుర్రాళ్లు ఆగుతారా? స్కెచ్చు గీసినట్టుగా ఉందిరో ఈ సుందరీ.. అని పాటందుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post