వంద మంది పంజాబ్‌ రైతుల అదృశ్యం మానవ హక్కుల సంస్థ ఆందోళన


వంద మంది పంజాబ్‌ రైతుల అదృశ్యం

దిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు కోరుతూ గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల కవాతులో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ వార్త కలకలం రేపుతోంది. ఎర్రకోట ఘటనల అనంతరం గత అయిదు రోజులుగా 100మందికి పైగా నిరసనకారుల జాడ తెలియడంలేదంటూ పంజాబ్‌ మానవహక్కుల సంస్థ శనివారం వెల్లడించింది. వీరిలో మోగా ప్రాంతంలోని తతారీవాలా గ్రామానికి చెందిన 12 మంది రైతులూ ఉన్నట్లు తెలిపింది. కనిపించకుండా పోయిన వారికి సంబంధించిన జాబితాలు తమకు అందుతున్నట్లు బీకేయూ(రాజేవాల్‌) అధ్యక్షుడు బల్బీర్‌ సింగ్‌ వెల్లడించారు. సమగ్ర పరిశీలన అనంతరం అదృశ్యమైన వారి పేర్లను ప్రకటిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, ఖల్రా మిషన్‌, పంజాబ్‌ మానవహక్కుల సంస్థ తెలిపాయి. 400 మందికి పైగా నిరసనకారులు పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారని సామాజిక ఉద్యమ కార్యకర్త సరాబ్జీత్‌ సింత్‌ వెర్కా ఆరోపించారు. వీరిలో కొందరిని తీహార్‌ జైలుకు తరలించినట్లు సమాచారం ఉందన్నారు.

Post a Comment

أحدث أقدم